Mother remarriage son committed suicide
Mother remarriage son committed suicide : తల్లి మరో పెళ్లి చేసుకుందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామం బసవతారక నగర్ ప్రాంతం పరిధిలో చోటు చేసుకుంది.
30ఏళ్ల క్రితం ఆంజాద్ బాషాతో మున్నీకి వివాహం జరిగింది. వారికి ఆషీ, అబ్బాస్ ఇద్దరు కుమారులు ఉన్నారు. మున్నీ కుటుంబం బాపట్ల నుంచి యర్రబాలెం వచ్చి పదేళ్లయింది. అయితే, నాలుగేళ్ల క్రితం మున్నీ భర్త అంజాద్ బాషా అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల మున్నీరు మరో వ్యక్తిని వివాహం చేసుకొని బసవతారక నగర్‌లో జీవిస్తోంది. ఈ విషయం చిన్న కొడుకు అబ్బాస్ (24)కు నచ్చలేదు. దీంతో తల్లిని ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
తల్లి మరో పెళ్లి చేసుకోవటాన్ని అబ్బాస్ జీర్ణించుకోలేకపోయాడు. పలుసార్లు తల్లికి నచ్చజెప్పినా ఆమె వినలేదు. అయితే, గురువారం అబ్బాస్ తన అన్న ఆషితో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో మనస్థాపం చెందిన అబ్బాస్ సమీపంలో ఉన్న బావిలో దూకాడు. ఆషి తమ్ముడు అబ్బాస్ ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇంటికి వెళ్లి స్థానికులకు విషయాన్ని చెప్పాడు. అప్పటికే చీకటి పడగా.. శుక్రవారం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.