చిత్తూరులో మరో ప్రమాదం, ప్రాణం మీదికి తెచ్చిన సెల్ఫీ మోజు, వాగులో కొట్టుకుపోయిన తల్లీ కొడుకు

  • Publish Date - October 23, 2020 / 03:10 PM IST

selfie: చిత్తూరు జిల్లాను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. కొండయ్యగారిపల్లి, దుర్గరాజాపురంలో కారు కొట్టుకుపోయిన గంటల వ్యవధిలోనే.. మరో వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కౌండిన్య వాగులో పడి తల్లి, కొడుకు కొట్టుకుపోయారు. వాగులో పడిన వారిని పలమనేరుకు చెందిన పర్వీన్, హమీదుల్లాగా గుర్తించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును చూసేందుకు తల్లీ కుమారుడు వెళ్లారు. అయితే సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు హమీదుల్లా వాగులో పడిపోయాడు. ఇది గమనించిన తల్లి కుమారుడిని రక్షించే ప్రయత్నంలో వాగులో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ ఇద్దరి కోసం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.