×
Ad

Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు

అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Published On : May 18, 2022 / 11:09 AM IST

Murder (1)

aunt killed : కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం జరిగింది. అత్తను అల్లుడు హత్య చేశాడు. అత్తపై కత్తితో దాడి చేసి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం పిఠాపురంలో అత్త గండేపల్లి రమణమ్మ, రమేష్ అత్తాఅల్లుళ్లు. ఉదయం అత్త గండేపల్లి రమణమ్మపై అల్లుడు రమేష్ కత్తి తో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అత్త రమణమ్మ అక్కడక్కడే మృతి చెందారు.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తను హత్య చేసి రమేష్.. తన కొడుకుని తీసుకుని వెళ్లిపోయి, పోలీసులకు లొంగిపోయాడు.

Telangana : తాగుబోతు భర్తను హత్యచేసిన అత్తింటివారు

కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు రమేష్ ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.