విజయవాడ, విశాఖ ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన చేసింది. 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ శ్రీధర్ ఓ ప్రకటన చేశారు.
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడతో పాటు భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని అన్నారు.
గోల్కొండ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-గుంటూరు (17201/17202) ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు అందుబాటులో ఉండదు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233/17234) ఫిబ్రవరి 10 నుంచి 21 వరకు రద్దయింది.
iPhone SE 4: శుభవార్త.. ఇక రెడీగా ఉండండి.. ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చేస్తోంది.. ధర ఇంత తక్కువా?
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్.. గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) ఫిబ్రవరి 10, 11తో పాటు 15, 18 నుంచి 20 తేదీల్లో అందుబాటులో ఉండదు. శాతవాహన ఎక్స్‌ప్రెస్.. విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) ఫిబ్రవరి 11, 14, 16 తేదీలతో పాటు 18 నుంచి 20 తేదీల మధ్య రద్దు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) ఫిబ్రవరి 19, 20న దాదాపు 75 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. అలాగే, కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఆదిలాబాద్-తిరుపతి (17406) ఫిబ్రవరి 9, 11, 14, 18, 19న గంటన్నర ఆలస్యంగా వెళ్తుంది.