సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ చరణ్

  • Publish Date - November 27, 2020 / 11:26 AM IST

sp charan thanks ap cm ys jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు లోని ప్రభుత్వ సంగీతనృత్యకళాశాలకు దివంగత దిగ్గజ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టటం పట్ల ఆయన కుమారుడ ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు.


తనతండ్రికి తక్కిన గొప్ప గౌరవమని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు.



https://10tv.in/ap-cabinet-meeting-discussion-on-key-issues-ysr-statue-at-polavaram-project/
మైసూరు వర్సిటీలో ఎస్పీ బాలు అధ్యయన పీఠం
మైసూరు: ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం పేరుతో మైసూరు విశ్వ విద్యాలయంలో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం వర‍్సిటీలో వీసీ హేమంత్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సిండికేట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధనలను, పాటలను భవిష్యత్‌ తరాలవారికి అందించేలా ఈ పీఠం నెలకొల్పుతున్నామని వీసీ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలను కేటాయిస్తామన్నారు.