South Central Railway: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. జనవరి 1 నుంచి 19 వరకు.. ఏఏ ప్రాంతాలకంటే?

సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 1 నుంచి 19 వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

South Central Railway

South Central Railway: సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతాయి. ప్రతీయేటా సంక్రాంతి పండుగకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ ఏడాదికూడా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా నగర వాసులు తమతమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు వీలు కల్పించింది.

South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ల భర్తీ

ప్రస్తుతం రోజువారిగా నడుస్తున్న 278 రైళ్లకు అదనంగా పండుగ సమయాల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక రైళ్లు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తాయి అనే వివరాలను తేదీలతో సహా అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు ఆయా ప్రాంతాలకు వెళ్తాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

మచిలీపట్నం – కర్నూల్ సిటీ
( తేదీలు :- 3, 5, 7, 10, 12, 14, 17)

కర్నూల్ సిటీ – మచిలీపట్నం
( తేదీలు:- 4, 6, 8, 11, 13, 15, 18)

మచిలీపట్నం – తిరుపతి
( తేదీలు:- 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16)

తిరుపతి – మచిలీపట్నం
( తేదీలు:- 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17)

విజయవాడ – నాగర్‌సోల్
( తేదీలు:- 6, 13)

నాగర్ సోల్ – విజయవాడ
( తేదీలు:- 7, 14)

కాకినాడ టౌన్ – లింగంపల్లి
( తేదీలు:- 2, 4, 6, 9, 11, 13, 16, 18)

లింగంపల్లి – కాకినాడటౌన్
( తేదీలు:- 3, 5, 7, 10, 12, 14, 17, 19)

పూర్ణ – తిరుపతి
( తేదీలు:- 2, 9, 16)

తిరుపతి – పూర్ణ
( తేదీలు:- 3, 10, 17)

తిరుపతి – అకోలా
( తేదీలు:- 6, 13)

అకోలా – తిరుపతి
( తేదీలు:- 8, 15)

మచిలీపట్నం – సికింద్రాబాద్
( తేదీలు:- 1, 8, 15)

సికింద్రాబాద్ – మచిలీపట్నం
( తేదీలు:- 1, 8, 15)