విశాఖలో విషాదం.. తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతిపై ద్వారకానగర్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SPF Constable committed suicide

Visakha Constable Suicide : విశాఖ పట్టణం ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐవోబీ బ్యాంకులో గన్ మెన్ గా శంకర్ రావు విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రతీరోజూలాగానే గురువారం తెల్లవారు జామున 5గంటల సమయంలో డ్యూటీకి హాజరయ్యాడు.. కొద్దిసేపటికే తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఎల్ఆర్ తో కాల్చుకొని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ద్వారకానగర్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Suv Accident : ఒళ్లుగగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్

శంకర్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ఇబ్బందులు వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా.. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.