Suv Accident : ఒళ్లుగగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్

సీసీటీవీలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

Suv Accident : ఒళ్లుగగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్

Suv Accident Video

Suv Accident : తమిళనాడులోని మధురై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన వాహనం డివైడర్ ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్సిడెంట్ చాలా దారుణంగా ఉంది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమాల్లో స్టంట్స్ తరహాలో ఈ ప్రమాదం ఉందంటున్నారు.

విరుదునగర్-మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఇవాళ ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఎస్ యూవీ.. అదుపు తప్పింది. డివైడర్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్ ను ఢీకొట్టింది. అంతే వేగంతో గాల్లో పల్టీలు కొట్టింది. ఆ పక్క రోడ్డు నుంచి ఈ పక్క రోడ్డు మీదకు వచ్చి పడింది. కారు ప్రమాదం అంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. సీసీటీవీలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను మధురై విల్లుపురంకు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు దలవాయిపురం ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

ఈ యాక్సిడెంట్ ను కళ్లారా చూసిన వాళ్లు షాక్ కి గురయ్యారు. సినిమాల్లో చూపించే స్టంట్స్ తరహాలో ఈ యాక్సిడెంట్ ఉందంటున్నారు.

Also Read : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు!