Consultancy
Spring Field Overseas: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది అమెరికన్ ఎంబసీ. విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తున్నారు. ఇందులో ప్రధాన వ్యక్తిగా ముళ్లపూడి కేశవ్ ను గుర్తించారు.
మంగళవారం ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్.. విజయవాడ వచ్చి స్ప్రింగ్ ఫీల్డ్ overseas consultantsలో తనిఖీలు నిర్వహించింది. ప్రాథమికంగా కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం.
స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకు వెళ్లి సేకరిస్తుండగా మీడియా మిత్రులను బయటకుపంపి.. సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఆ కంపెనీ ఎండీ కేశవ్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండాపోయారు.
Read Also: హైదరాబాద్ లో భారీ మోసం.. వైద్యుడికి 12 కోట్ల సైబర్ టోకరా
తమకు జరిగిన అన్యాయంపై నిలదీదసేందుకు బాధిత తల్లిదండ్రులు స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతున్నారు.