Cyber Crime : హైదరాబాద్ లో భారీ మోసం.. వైద్యుడికి 12 కోట్ల సైబర్‌ టోకరా

సైబర్ నేరగాళ్ల చేతిలో హైదరాబాద్ కి చెందిన పశువుల డాక్టర్ నిలువునా మోసపోయారు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ.11.90 కోట్లు సమర్పించుకున్నాడు. చివరకు మోసపోయానని తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber Crime : హైదరాబాద్ లో భారీ మోసం.. వైద్యుడికి 12 కోట్ల సైబర్‌ టోకరా

Cyber Crime

Cyber Crime : సైబర్ నేరగాళ్ల చేతిలో హైదరాబాద్ కి చెందిన పశువుల డాక్టర్ నిలువునా మోసపోయారు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ.11.90 కోట్లు సమర్పించుకున్నాడు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. సీవీ రావు అనే వ్యక్తి పశువుల వైద్యుడిగా పనిచేస్తున్నారు. అతడికి ఫేక్ బుక్ లో గీతా నారాయణ అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో డాక్టర్ రావు రిప్లై ఇచ్చారు. ఆలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

ఇక ఈ క్రమంలోనే డాక్టర్ ను బోల్తా కొట్టించడం మొదలు పెట్టారు సైబర్ నేరగాళ్లు. తమ వద్ద పశువుల వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగించే అగ్రోమెటిజమ్‌ ఆయిల్‌ తక్కువ ధరకు దొరకుతున్నదని, దానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని చెప్పింది. ఇదే సమయంలో బెంజిమెన్ అనే వ్యక్తి ఆ ఆయిల్ కొంటామని రావుకు మెయిల్ పంపించాడు. ముంబైలో లీటర్ ఆయిల్ రూ.10.8 లక్షలకు దొరుకుతుందని, తాము అమెరికా, లండన్ లో రూ.16.3 లక్షలకు (22 వేల డాలర్ల)కు కొంటామని సీవీ రావుని నమ్మించాడు బెంజిమెన్.

లాభం అధికంగా వస్తుందని ఆలోచించిన డాక్టర్ రావు.. కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గీత నారాయణను సంప్రదించాడు. ఆమె లక్ష్మి అనే మహిళ ఫోన్ నంబర్ ఇవ్వడంతో ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో తమ ప్లాంట్‌ ఉన్నదని అక్కడినుంచి ఆయిల్‌ పంపిస్తామని గీతా నారాయణ ద్వారా పరిచయమైన లక్ష్మి అనే మహిళ సీవీరావు తెలిపింది. అయితే ముందుగా ఒక లీటర్ ఆయిల్ కావాలని రావు ఆర్డర్ చేశారు. దానికి వారు అంగీకరించలేదు. కనీసం 350 లీటర్లు తీసుకుంటేనే లాభాలు వస్తాయని, దీంతో ఒక బ్యాచ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవచ్చని ఆశ పుట్టించారు.

ఇది తమకూ కలిసి వస్తుందని నమ్మించారు. కొరియర్‌లో ఆయిల్‌ పార్సిల్‌ వస్తుందని నమ్మబలికారు. వారి మాయమాటలు నమ్మిన రావు దుబాయ్‌లో ఉన్న మూడు, అమెరికాలో ఉన్న ఆరు బ్యాంకు ఖాతాలకు రూ.11.9 కోట్లకు (16.11 లక్షల డాలర్లు)పైగా పంపించారు. ఇతర ఖర్చులు, వ్యాట్ కోసం 2.50 లక్షల డాలర్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేశారు. దీంతో అతను మోసపోయానని గ్రహించి గురువారం సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రంలో ఇంతపెద్ద సైబర్ నేరం జరగడం ఇదే తొలిసారి అంట. ఇక డాక్టర్ సీవీ రావు అమెరికన్ సిటిజన్ కావడంతో చెల్లింపులు మొత్తం డాలర్లలోనే చేసినట్లు పోలీసులు గుర్తించారు.