Police Arrest a rowdy sheeter : హైదరాబాద్ లో పలు పోలీసు స్టేషన్లలో కేసులుండి, 16 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ డేవిడ్ రాజును ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు గతంలో ఎర్రగడ్డలో జరిగిన ఏడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు.
1991 నుంచి ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో రాజు పై పలు కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో పోలీసులు డేవిడ్ రాజును అదుపులోకి తీసుకున్నారు.