Srivari Brahmotsavam: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.
CM Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్.. పరకామణి భవనం ప్రారంభం
ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వామి వారు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో వివిధ కళా బృందాలు ఇచ్చిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పురాణాల ప్రకారం చిన్న శేషుడిని వాసుకి (నాగ లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి.. ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి
బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.