Srisailam Temple: శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు

ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు

Srisaialm

Srisailam Temple: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు.. స్వామి వారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో ఎస్.లవన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈక్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న ఆలయ అధికారులు.. ఆమేరకు స్వామి వారి దర్శన సమయంలో రద్దీని తగ్గించేందుకు ముందుగానే టికెట్లు విడుదల చేశారు. కాలినడకన(పాదయాత్రగా) వచ్చే భక్తులకు నేరుగా అతి శీఘ్ర దర్శనం కలిగేలా చర్యలు చేపట్టినట్లు ఈవో ఎస్.లవన్న తెలిపారు.

Also read: Srisailam : మల్లన్న సర్వదర్శనం రద్దు, తీవ్ర నిరాశలో భక్తులు

ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. రోజుకి 5 వేల శీఘ్ర దర్శన టికెట్లు, 2 వేల అతి శీఘ్ర దర్శన టికెట్లు, 6 వేల ఉచిత దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు రిస్ట్ బ్యాండ్ తగిలించి వారికీ నేరుగా అతి శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. మల్లన్న భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దర్శన సమయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Also read: TTD: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి