రాజధానిపై ప్రకటన : అమరావతి రైతులు భయపడొద్దు – బోత్స

  • Publish Date - December 26, 2019 / 02:03 PM IST

అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రానున్న రోజుల్లో చూడాలన్నారు. ప్రతిపక్ష నేత బాబు చెబుతున్న మాటలను నమ్మవద్దని..ఆయన మోసకారి అంటూ విమర్శించారు.

సెక్రటేరియట్, అసెంబ్లీ ఉంటే అభివృద్ధి చెందుతుందని బాబు అప్పుడు చెప్పి..ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. కేబినెట్ సమావేశంలో రాజధాని అంశంపై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువరిస్తామన్నారు మంత్రి బోత్స. 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా..మంత్రి బోత్స..మాట్లాడుతూ..
రాజధాని ప్రాంతంలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రకటించారు.

రైతుల్లో ఆందోళన నెలకొందని, ఎలాంటి భయం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. 13 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి చెప్పారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసింది బాబేనని స్పష్టం చేశారు. లక్షా 9 వేల కోట్ల రూపాయలు ప్రాథమికంగా అంచనా వేశారని, ఇప్పుడు మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయలకు వెళ్లే ప్రమాదం ఉందన్న బోత్స..మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలన్నారు. 

ఐదేళ్ల పాలనలో కేంద్రం వద్దనుంచి బాబు ఎంత తీసుకొచ్చారు ? లక్షా 95 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని, అందులో కేవలం రూ. 5 వేల 458 కోట్లు ఖర్చు పెట్టారని, అందులో రూ. 1500 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇచ్చిందని విషయాన్ని గుర్తు చేశారు. 
Read More : రాజధాని రగడ : అన్ని డబ్బులు లేవు..రైతులను సంతోషపరుస్తాం