Devaragattu: దేవరగట్టులో కర్రల సమరం.. 70 మందికి గాయాలు.. భారీ వర్షంలోనూ బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు పోటెత్తిన ప్రజలు

కర్నూల్ జిల్లాలోని హొళిగుంద మండలం దేవరగట్టులో ప్రతీయేటా దసరా రోజున నిర్వహించే కర్రల సమరంలో 70 మందికి గాయాలయ్యాయి.

Devaragattu: కర్నూల్ జిల్లాలోని హొళిగుంద మండలం దేవరగట్టులో ప్రతీయేటా నిర్వహించే కర్రల సమరం బుధవారం జరిగింది. దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ సమరంలో 70 మంది భక్తులకు గాయ్యాలయ్యాయి.

Indian Cough Syrup: ఆ నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దు.. హెచ్చరికలు జారీచేసిన డబ్ల్యూహెచ్ఓ.. ఎందుకంటే?

కర్నూల్ జిల్లాలోని దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. దసరా బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు. ఈ క్రమంలో ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా గ్రామాలవారిగా విడిపోయి భక్తులు కర్రలతో తలపడగా.. 70 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉంటే ఈసారి బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. భారీ వర్షం పడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ఈ ఉత్సవానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం అర్థరాత్రి దాటిన తరువాత జైత్రయాత్ర మొదలైంది. గురువారం ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిస్తారు. అయితే 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామివారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. 9వ తేదీ మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ట్రెండింగ్ వార్తలు