Vande Bharat Express : విశాఖ కంచరపాలెంలో వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ట్రైన్ కున్న కెమెరా ఆధారంగా నిందితులను ఐడెంటిఫై చేశారు. నిందితులను శంకర్, దిలీప్, చందుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. నిన్న కంచరపాలెంలో నిలిపి ఉంచిన వందేభారత్ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వందే భారత్ రైలు వచ్చింది.
సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న విషయం విదితమే. త్వరలో సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా వందేభారత్ రైలు వైజాగ్ కు వచ్చింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Also Read..Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?
వాస్తవానికి ఈ ట్రైన్ ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే ట్రాక్ అప్ గ్రడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు పలువురు నేతలు వందే భారత్ ను విశాఖపట్నం వరకు పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.