Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?

మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణం సంతృప్తికరంగా, విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుందని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ అన్నారు. ఇంతకు ముందు వెర్షన్‭తో పోలిస్తే ఈ రైలు బరువును 38 టన్నులు తగ్గించారు. వందేభారత్ ఎక్స్‭ప్రెస్-2 రైలు బరువు 392 టన్నులు. ఇక రెండు అడుగుల నీటిలో కూడా ఈ రైలు దూసుకెళ్తుందట.

Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?

you should know some intrest things about Vande Bharat Express

Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైలును ప్రారంభించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ప్రారంభించింది మూడవది. అయితే ఈ మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

16 కోచులు ఉన్న ఈ రైలు 1,128 మంది ప్యాసింజర్ల కెపాసిటీ ఉంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణం సంతృప్తికరంగా, విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుందని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ అన్నారు. ఇంతకు ముందు వెర్షన్‭తో పోలిస్తే ఈ రైలు బరువును 38 టన్నులు తగ్గించారు. వందేభారత్ ఎక్స్‭ప్రెస్-2 రైలు బరువు 392 టన్నులు. ఇక రెండు అడుగుల నీటిలో కూడా ఈ రైలు దూసుకెళ్తుందట.

ఈ రైళ్లు గరిష్టంగా వంద మైళ్ల వేగంతో అంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వచ్చే యేడాది ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.

Congress President Poll: బేషరతు క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ రేసు గుర్రం శశి థరూర్.. ఎందుకో తెలుసా?