Andhra Pradesh - Electricity Trade Union (Photo : Google)
Andhra Pradesh – Electricity Trade Union : విద్యుత్ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కార్యాచరణ ఇచ్చామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 17న విద్యుత్ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి ప్రకటించారు.
పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించిన కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ధర్నాకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్ కమిటీ ధర్నా చేపడుతుందన్నారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం మహాధర్నా తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.
Also Read..Vundavalli Sridevi : టీడీపీకి శ్రీదేవి టెన్షన్..! చంద్రబాబు ఏం చేయనున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ డిమాండ్లు..
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్ ఉద్యోగులకు కూడా కనీసం 23% ఫిట్ మెంట్ ఇవ్వాలి.
* విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్ మెంట్ స్ట్రగుల్ కమిటీకి ఆమోదయోగ్యం కాదు.
* కాంట్రాక్ట్ కార్మికులకు 2022 PRC ప్రకారం వేతనాలు పెంచాలి.
* థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ యాజమాన్యాలే నేరుగా కార్మికులకు వేతనం ఇవ్వాలి.
* కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్.
Also Read..Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు
ఏపీ ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్ జారీ చేసిన ఉత్తర్వులు..
* ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ ఉత్తర్వులు.
* థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు.
* హైస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలను సవరించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
* హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ. 30,605కు, స్కిల్డ్ కార్మికులకు రూ.20,598 నుంచి రూ. 27,953 కు పెంపు
* సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236 కు, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ. 16,473 నుంచి రూ.22,318కి పెంచుతున్నట్టు ఉత్తర్వులు.
* 2023 ఆగస్టు 9న సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో 2018 పేస్కేల్ ప్రకారం 2 శాతం పెంపుదలకు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు అంగీకరించాయని పేర్కొన్న ప్రభుత్వం.