×
Ad

Student Suicide : సెల్ ఫోన్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • Published On : July 28, 2021 / 10:25 PM IST

Student Suicide

Student suicide : సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌ కుమారుడు అజిత్‌ (17) ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

కరోనా నేపథ్యంలో కాలేజీ తెరవకపోవడంతో పుస్తకాలు పక్కన పెట్టేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సెల్‌ఫోన్‌ తీసుకుని ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తండ్రి మందలించాడు. చదువులపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు.

దీంతో మనస్తాపం చెందిన అజిత్‌ గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు.