Site icon 10TV Telugu

వైసీపీకి కృష్ణ సోదరుడు రాజీనామా

Super Star Krishna Brother Adi Seshagiri Rao Resign YSRCP

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆదిశేషగిరిరావు అడిగారట. ఇందుకు నో చెప్పిన జగన్.. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారట. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరేది చెప్పలేదు. అయితే ఏపీ సీఎం చంద్రబాబుకి కూడా ఆదిశేషగిరి రావు బంధువు అవుతారు. దీంతో టీడీపీలో చేరే అవకాశముందని సమాచారం. సంక్రాంతి తర్వాత కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరికపై ఆదిశేషగిరి రావు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Exit mobile version