Supreme Court Candels Sujspension On Ips Ab Venkateswara Rao
sc candels sujspension on ips AB venkateswara rao : ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SLP ను ధర్మాసనం తోసిపుచ్చింది. సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హై కోర్ట్ ఇచ్చిన తీర్పు లో జోక్యం చేసుకోం అంటూ స్పష్టంచేసింది. రెండేళ్ల తరువాత కూడా సస్పెన్షన్ కుదరదని తేల్చి చెప్పింది.ఏపీ వెంకటేశ్వరరావుని మళ్ళీ సర్వీస్ లోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. ఏపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తనపై సస్పెన్షన్ విధించి రెండేళ్లు అవుతున్నా…ఇంకా సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదని, తనను సర్వీసులోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణ దశలో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్సెన్షన్‌ను ఎత్తివేయలేమని ఏపీ ప్రభుత్వం స్సెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు… ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడానికి వీల్లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఏబీపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఏబీని సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.