Dollar Seshadri : డాలర్ శేషాద్రి అంత్యక్రియలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్‌డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమయాత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొననున్నారు.
- kunduru Vinod
- Published On : November 29, 2021 / 07:26 PM IST
Seshadri
Dollar Seshadri : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్‌డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమసంస్కారాలు మంగళవారం తిరుపతి గోవిందదామంలో నిర్వహించనున్నారు. శేషాద్రి అంత్యక్రియల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొంటారు. రేపు ఉదయం 11.10గం.లకు ఎన్వీ రమణ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటునుంచి డాలర్ శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి అంతిమ నివాళి అర్పిస్తారు. అనంతరం జరిగే అంతిమ యాత్రలో పాల్గొంటారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
చదవండి : Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..
కాగావిశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి వెళ్లగా.. ఈ రోజు తెల్లవారుజామున డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. దీంతో వ్యక్తిగత సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శేషాద్రి మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు పలువు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శేషాద్రి పార్థివదేహన్ని విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుపతి తీసుకురానున్నారు అధికారులు.
చదవండి : Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత
supreme court, chief justice, nv ramana, dollar seshadri, crimises
