ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసుని దర్యాఫ్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేశ్ ను నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యంపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
boy dies after eating biscuit in kurnool district
అగ్నిప్రమాద ఘటనపై విచారణకు హైకోర్టు ఆదేశాలు అడ్డుగా ఉన్నాయని, వెంటనే స్టే ఎత్తివేయాలని పిటిషన్‌లో కోరింది. ప్రమాదంపై విచారణ ముందుకు సాగితేనే.. నిజా నిజాలు బయటకు వస్తాయని, ప్రాథమిక దశలోనే చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దర్యాఫ్తు జరిపేందుకు ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చింది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన రమేష్ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబు కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు.
ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీపీ శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి చెన్నె, బెంగళూరు, హైదరాబాద్‌కి స్పెషల్ టీమ్‌లను పంపామని.. ఆస్పత్రి, హోటల్ మధ్య ఎంవోయూ ఉందని తొలుత చెప్పారని.. ఇప్పటి వరకు ఆ ఎంవోయూ పోలీసులకు ఇవ్వలేదన్నారు.
https://10tv.in/cbi-inquiry-in-antarvedi-chariot-fire-incident/
స్వర్ణ ప్యాలెస్ రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. బాధిత కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీ చేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్ అనుమానితులతో పాటుగా వైరస్ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకముందే.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పింది. సదరు హోటల్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండానే పేషెంట్లను తరలించిందని తెలిపింది. స్వర్ణప్యాలెస్ ఘటనపై కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్‌ఓ, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది.