Supreme Court
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని సుప్రీంకోర్టు ను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోహిత్ రెడ్డి పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తాము జోక్యం చేసుకునేందుకు కరణాలేవి కనిపించడం లేదని తెలిపింది.
Also Read : Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశం
పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. తాము జోక్యం చేసుకునేందుకు కరణాలేవి కనిపించడం లేదని పేర్కొంది.
Also Read : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్.. ఏం చెప్పారంటే?