ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వెయ్యడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయడంతో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారణ జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు ఉన్న రంగుల స్థానంలో వేరే రంగులు వేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది.
See Also | స్విస్ టెక్నాలజీతో ఏపీలో పేదలకు ఇళ్లు