Pedda Reddy Warns JC Prabhakar Reddy (Photo : Google)
తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్, తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. సై అంటే సై కయ్యానికి కాలు దువ్వారు. దీంతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. నీ సంగతి తేలుస్తా, నీ ఇంటిని కూలుస్తా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.
తాడిపత్రి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కార్మికులతో కలిసి ఆసుపత్రి నుంచి జేసీ నివాసం వద్దకు ర్యాలీగా బయలుదేరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. డీఎస్పీ గంగయ్య సర్ది చెప్పడంతో చివరికి ఆందోళన విరమించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.
Also Read : నన్ను మిత్రుడిగానే చూడండి .. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు : పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తా, అంతవరకు జాగ్రత్త అంటూ జేసీని హెచ్చరించారు. అంతేకాదు తాడిపత్రిలో నీ ఇంటిని కూల్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ జేసీకి వార్నింగ్ ఇచ్చారాయన. ప్రతి పనిని అడ్డుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి చూస్తా అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.
ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెద్దారెడ్డి ఎప్పుడూ కూడా నేను తాడిపత్రిలో లేని సమయంలోనే నా ఇంటి వద్దకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మా ఇంటి వద్దకు వచ్చే వారికి టీ స్నాక్స్ ఇచ్చే ఏర్పాటు చేశాను అని సెటైర్ వేశారు. సోమవారం తాడిపత్రికి వెళ్లి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా చూపిస్తాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
Also Read : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన