టార్గెట్ జగన్ : కుంటుపడిన రాష్ట్రాభివృద్ధి – బాబు

  • Publish Date - December 19, 2019 / 01:10 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రివర్స్‌ టెండర్స్‌ నుంచి  కొత్త ఎక్సైజ్‌ విధానం వరకు అన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ అధినేత చందబ్రాబు అనంతపురం జిల్లాలో 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం పర్యటించారు.

తెలుగుదేశం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలపై దాడులు, రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసుల వ్యవహార శైలి, ఎక్సైజ్‌ విధానం సహా పలు అంశాలపై  విరుచుకుపడ్డారు. మద్యంపై జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్‌ విధానం తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు మద్యం అక్రమంగా రవాణ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోగా.. వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి పోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. విశాఖలో అదానీ డెటా సెంటర్‌, లులూ గ్రూప్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అంశాలను ప్రస్తావించారు. ప్రతిపక్షం గొంతు నొక్కే విధంగా అసెంబ్లీని మయసభగా మార్చేశారని మండిపడ్డారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండర్స్‌ విధానంతో రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందని  విమర్శించారు చంద్రబాబు. 
Read More : సీఎం జగన్ అభిప్రాయం మార్చుకోవాలి..అమరావతి రైతుల అల్టిమేటం