TDP – Janasena : టీడీపీ, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ఉమ్మడి పోరాటం, తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను ప్రకటించాయి.

Pawan Kalyan - Lokesh meeting

TDP Janasena Coordination Committee : టీడీపీ, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాజమండ్రిలోని మంజీరా హోటల్ వేదికగా ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ హాజరయ్యారు. ఉమ్మడి పోరాటం, తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను ప్రకటించాయి.

ఇక కొద్ది సేపటి క్రితం చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్ అక్కడ జరిపిన చర్చల వివరాలను నేతలకు వివరించనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతోపాటు భువనేశ్వరి నిజం గెలివాలి పర్యటనలకు పరస్పరం సహకరించుకోవాలనే అంశంపై చర్చ జరుగనుంది.

DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు

టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య.. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, యశస్వి, బొమ్మిడి నాయికర్ సమావేశంలో పాల్గొననున్నారు.