Chandrababu : అబద్ధాల పార్టీ, అవినీతికి అడ్డా వైసీపీ : చంద్రబాబు
ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలన్నారు.
- bheemraj
- Published On : March 4, 2022 / 04:11 PM IST
Chandrababu
Chandrababu Criticized YCP : పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి పైసా కూడా నిరూపించలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికి పోలవరం ఉరకలెత్తేదని చెప్పారు. ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పోలీసులు ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని అన్నారు.
కార్యకర్తలకు ఆరోగ్యపరంగా, వృత్తి పరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని చెప్పారు. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే యువత ఉద్యోగాల కోసం ఎక్కడికీ పోవాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు.
Chandrababu Viveka : అన్నింటిని మేనేజ్ చేయగలిగిన వాడినే అయితే.. ఎందుకు ఓడిపోతాను? చంద్రబాబు
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఆయా రాష్ట్రాలకు ఆదాయం తెచ్చినట్లు అమరావతి మన ఏపీకి ఆదాయం తెచ్చిపెట్టేదని పేర్కొన్నారు. అమరావతికి కులం అంటగట్టి, స్మశానం అంటూ నిర్వీర్యం చేస్తుంటే ఎవరికీ రోషం లేదా అని అన్నారు. అబద్ధాల పార్టీ, అవినీతికి అడ్డా వైసీపీ అని విమర్శించారు.
