Chandrababu Viveka : అన్నింటిని మేనేజ్ చేయగలిగిన వాడినే అయితే.. ఎందుకు ఓడిపోతాను? చంద్రబాబు

ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు(Chandrababu Viveka) మండిపడ్డారు. వివేకా హత్య విషయంలోనూ..

Chandrababu Viveka : అన్నింటిని మేనేజ్ చేయగలిగిన వాడినే అయితే.. ఎందుకు ఓడిపోతాను? చంద్రబాబు

Chandrababu (1)

Chandrababu Viveka: రాష్ట్రంలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Viveka) తీవ్రంగా స్పందించారు. వివేకా హత్యోదంతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య విషయంలోనూ తనపై ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు.

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సర్పంచ్ ల అవగాహన సదస్సులో వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు (Chandrababu Viveka). వివేకా హత్యపై ఎన్నో టకాలాడి కట్టుకథలు అల్లారని చంద్రబాబు ఆరోపించారు. నేనే అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట అని చంద్రబాబు అన్నారు. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషేనట అని వ్యంగ్యంగా మాట్లాడారు.

”సీబీఐని కూడా నేనే ప్రభావం చేశానoటున్న వాళ్లు., చివరికి మొగుడు పెళ్లాం కాపురం చేసుకోపోయినా నేనే కారణం అంటారేమో? సినిమా టిక్కెట్ల సమస్య, ఉద్యోగుల సమస్యకు నేనే కారణమట. ఇన్నింటిని నేనే మేనేజ్ చేయగలిగితే ఎన్నికల్లో ఎలా ఓడిపోతాను? బాబాయిని హత్య చేసిన వాడు రాజకీయాలకు అవసరమా? శిశుపాలుడికి కూడా 100 తప్పులు చేశాకే పాపం పండినట్లు, జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క అవకాశం ఇక చివరి అవకాశమే. బాబాయ్ హత్య తో జగన్ రెండు లక్ష్యాలు నెరవేర్చుకున్నారు. హత్యతో వివేకాను అడ్డు తొలగించుకున్నారు… నాపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందారు. సీబీఐ విచారణ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ లోకి వెళ్తారని జగన్ అన్నారా లేదా? చివరికి ఇప్పుడు వివేకా కూతురిని కూడా నా పావు అంటున్నారు” అని చంద్రబాబు(Chandrababu Viveka) ధ్వజమెత్తారు.

Kadapa : వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ కంటిన్యూ

“అవినాశ్ రెడ్డి వచ్చి చూడు.. అని నేనే శివశంకర్ రెడ్డితో చెప్పించా. రెండోరోజు ఆ పత్రికలో ‘నారాసురవధ చరిత్ర’ అని కూడా నేనే రాయించా. ఆ పేపర్ కు కూడా నేనే ఎడిటర్ ని. ఏం కథలు అల్లారు… జగన్ రెడ్డి మామకు చెందిన ఆసుపత్రి వాళ్లను కూడా నేనే రమ్మని చెప్పి, వారితో బ్యాండేజీల కుట్లన్నీ వేయించా. ఏమి నాటకాలయ్యా! బాడీని తీసుకెళ్లేందుకు ఓ బాక్సు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రక్తం కనిపించకుండా ఉండేందుకు పూలు వేయించారని సీఐ చెప్పాడు. ఆ పూలు కూడా నేనే వేయించా.

అక్కడ ఉండే వాళ్లందరూ మన మనుషులే కదా! శివశంకర్ రెడ్డి మన మనిషే, గంగిరెడ్డి మన మనిషే, సునీల్ యాదవ్ మన మనిషే, అవినాశ్ రెడ్డి కూడా మన మనిషే, చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషే! వివేకా కుమార్తె సునీత మన చేతిలో పావే, భారతి రెడ్డి కూడా ఇప్పుడు… ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు” అంటూ సెటైర్ల వర్షం కురిపించారు చంద్రబాబు. మనుషులు మాట్లాడేందుకు కూడా హద్దులు ఉంటాయని, ఓ పద్ధతి ఉంటుందని చంద్రబాబు (Chandrababu Viveka) అన్నారు.

Viveka Murder Case: చంద్రబాబు చేతిలో పావులుగా వివేకా కూతురు.. కుట్రలు చేస్తున్నారు

కోడికత్తి సరే చిన్న నాటకం, బాబాయిది పెద్ద నాటకం. ఏం జరిగినా అందుకు నేనే కారణం అంటున్నారు. వాళ్ల ఇళ్లలో భార్యాభర్తా కాపురం చేసుకోకపోయినా నేనే కారణమంటున్నారు. ఇదెక్కడి న్యాయం! సీబీఐ విచారణ వేస్తే సీబీఐలోనూ నా వాళ్లే ఉన్నారన్నారు. సినిమా టికెట్ల అంశానికి నేనే కారణమంటున్నారు, ఉద్యోగుల ఆందోళనలకు నేనే కారణమంటున్నారు. నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా! ఎన్నికలను కూడా మేనేజ్ చేసుకోలేనా? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏది చెప్పి అయినా ప్రజలను మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారు” అంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు చంద్రబాబు(Chandrababu Viveka).