మచిలీపట్నంలో జోలె పట్టిన బాబు

  • Publish Date - January 9, 2020 / 12:19 PM IST

రాజధానిలో టీడీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలతో కలిసి బాబు మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జోలె పట్టారు. వ్యాపార్తులు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ..ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కోనేరు సెంటర్ నుంచి వద్ద నడుచుకుంటూ విరాళాలు సేకరించారు బాబు.

బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో సహా నేతలు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మచిలీపట్నంకు చేరుకున్న బాబుకు మహిళలు హరతులు పట్టారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ..ప్ల కార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కొద్ది రోజులుగా అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి జేఏసీ పరిరక్షణ సమితి పేరిట ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.

దీనికి టీడీపీ, ఇతర పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేక్ ఇచ్చారు. దీనిపై బాబు ఫైర్ అయ్యారు. ఆందోళన చేస్తున్న ఆయన్ను అరెస్టు చేశారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అయ్యారు. 2020, జనవరి 09వ తేదీన మచిలీపట్నంలో పర్యటించాలని బాబు డిసైడ్ అయ్యారు. దీంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Read More : వేతనం సరిపోలేదా : రూ. 50 వేలు కోసం..జూబ్లీహిల్స్ ఎస్.ఐ. లంచావతారం

ట్రెండింగ్ వార్తలు