Chandra babu: కేంద్ర మంత్రి జయశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమెరికాలోని ఫ్లోరిడా జాక్సన్‌విల్లే బీచ్‌లో అద్దంకికి చెందిన రాజేష్‌కుమార్‌ ఆదివారం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయాడు.

Chandrababu Naidu

Chandra babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేష్ కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చెయ్యాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా జాక్సన్‌విల్లే బీచ్‌లో అద్దంకికి చెందిన పొట్టి రాజేష్‌కుమార్‌ ఆదివారం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయాడు. బీచ్‌‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో రాజేష్ తన ప్రాణాలు కోల్పోయాడు. రాజేష్ కుమార్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నాడు. రాజేష్ కుమార్ భౌతికకాయాన్ని స్వస్థలం తెప్పిచ్చేందుకు సహాయ పడాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్‌ను చంద్రబాబు లేఖలో కోరారు.