Chandrababu : అందరూ జాగ్రత్తగా ఉండండి.. లేదంటే రంగనాయకమ్మ పరిస్థితే మీకూ వస్తుంది- చంద్రబాబు వార్నింగ్

మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. లేదంటే గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది.

Chandrababu Naidu Slams CM Jagan

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పరిపాలనపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయన్నారు. మన మీదే దాడి చేసి మళ్లీ మన మీదే కేసులు పెడుతున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. మిషనరీ కూడా కాజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు చంద్రబాబు. ఎంతోమంది దాతలు స్థలాలు ఇస్తే మొత్తం కాజేశారని ఆరోపణలు చేశారు.

”సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు గుణదల మేరీ మాత చర్చికి వెళ్ళాను. చర్చికు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నేనే జరిపించాను. అది నా అదృష్టం. నేను ఈరోజు బైబిల్ చదివాను. శత్రువును కూడా ప్రేమించమని బైబిల్ చెబుతుంది. కానీ, ఇప్పుడు మిత్రుడు కూడా శత్రువుగా మారుతున్నాడు. మిషనరీలు స్కూల్స్ ఏర్పాటు చేశాయి. మిషనరీ కూడా కాజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎంతోమంది దాతలు స్థలాలు ఇస్తే మొత్తం కాజేశారు.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ ఉంది. ఒక అన్యాయం జరిగితే శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ ట్వీట్ పెడితే ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అన్ని మతాల వాళ్లు గుర్తించాలి. రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడులు జరుగుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడులు చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను ఇస్తే మాపైనే కేసులు పెట్టారు. ఈ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డికి సిగ్గుందా? అని అడుగుతున్నా.

రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతోంది, విద్యార్ధుల జీవితాలు నాశనం అవుతున్నాయని మేము చెప్పాం. ఇలా చెప్పటం తప్పా? అని డీజీపీని ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. రాష్ట్రంలో మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. అందరూ గమనించకపోతే.. గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఐటీ తీసుకొచ్చా. ఒక కులం వాళ్లే బాగుపడ్డారా? అన్ని కులాల వాళ్లు బాగుపడ్డారు.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

హైదరాబాద్ ను నానే బాగుచేశాను. ఒకప్పుడు హైదరాబాద్ ను బాగు చేసిన అనుభవంతో ఏపీని బాగు చేయడం తప్పా? ఏపీలో ఐదేళ్లు అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి చేశారో జగన్ చెప్పాలి. జగన్ విశాఖపట్నం వెళ్ళేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. విశాఖపట్నం వెళ్లొద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. ఇలాంటి సమయంలో ఓపిగ్గా ఉండాలి. అందుకే బూతులు తిట్టలేకపోతున్నా. నేను ప్రారంభించిన ప్రతిదీ నాశనం చేశారు. తుపాను నియంత్రణ చేయలేము. కానీ, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు.

గతంలో 10 రోజల్లో హూదూద్ తుపాను నష్ట నివారణ అంచనా వేసి చర్యలు తీసుకున్నాం. ఈ దేశంలో పేదరికం లేని సమాజం చూడాలని నేను అకాంక్షిస్తున్నా. క్రైస్తవులకు సంబంధించిన అనేక అంశాలు మ్యానిఫెస్టోలో పెడతాను. ఈరోజు నుండి 100 రోజులు.. ప్రతి ఒక్కరూ సహకరించాలి. మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో జరిగిపోయినవన్నీ మర్చిపోవాలి. సంతోషంగా నూతన సంవత్సరంలో వెళ్ళాలి” అని చంద్రబాబు ఆకాంక్షించారు.