ఎవరినీ వదలను, పుట్టగతులు ఉండవు అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్, కుప్పం నుంచి పోటీపై కీలక వ్యాఖ్యలు

బందిపోటు దొంగల్లా ఇది చేశారు. ఎవరినీ వదలిపెట్టను. సంక్రాంతి రోజు చెబుతున్నా. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు రాలేదు.

Chandrababu Naidu Strong Warning

Chandrababu Naidu : చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఇంటికి వెళ్లారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని పులివర్తి నాని తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కంట్లోకి పెట్రోల్ పడటంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పులివర్తి నానిని పరామర్శించారు చంద్రబాబు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై స్పందించారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా త్వరలోనే విడుదల చేస్తామన్నారు చంద్రబాబు. జాబితా విడుదల చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అడ్డూ అదుపు లేకుండా ఓటర్ లిస్ట్ మార్చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓట్ల మార్పులు జరుగుతున్నాయన్నారు. దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారని చెప్పారు. దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రగిరి ఓ కేసు స్టడీ గా మారిందన్నారు చంద్రబాబు.

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!

ఎన్నికల కమిషన్ మండిపడ్డా.. వీరిలో మార్పు రాలేదన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై నేను, పవన్ కల్యాణ్ ఎన్నికల కమిషన్ కి చెప్పామన్నారు. నా జీవితంలో ఇలాంటి దొంగలను చూడలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల వ్యవహారంపై పులివర్తి నాని 6 నెలలుగా పోరాడారు, చివరికు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 40ఏళ్లు దాటిన వారు కొత్తగా ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నారు అని చంద్రబాబు చెప్పారు. ఒకే వ్యక్తికి పేర్లు మార్చి ఒకటికి రెండు చోట్ల ఓట్లు పెట్టారని ఆరోపించారు. ఇది బరితెగింపు కాదా? అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఓటర్ లాగిన్ నాయకుల చేతిలోకి వెళ్ళిందన్నారు.

”బందిపోటు దొంగల్లా ఇది చేశారు. ఎవరినీ వదలబోము. సంక్రాంతి రోజు చెబుతున్నా. మీకు పుట్టగతులు ఉండవు. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు రాలేదు. టీడీపీ-జనసేన మొదటి లిస్ట్ త్వరలోనే విడుదల చేస్తాము. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కుప్పం నుంచే పోటీ చేస్తా. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించారు. ఎన్నికల కమిషన్ గట్టిగా ఉంటే భయపడతారు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

”వాళ్లే చందాలు వేసుకుని, వాళ్ల హుండీ పెట్టి కలెక్ట్ చేసి గెలిపించే నియోజకవర్గం అది. రాష్ట్రంలో హయస్ట్ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గాల్లో కుప్పం, చార్మినార్, సిద్ధిపేట. చార్మినార్ ఎంఐఎంది, సిద్ధిపేట హరీశ్ రావుది, కుప్పం నాది. ఈ మూడు ఎప్పుడూ హయ్యస్ట్ మెజార్టీ. నేను ఎప్పుడూ ఎన్నికల ప్రచారానికి కుప్పంకి వెళ్లలేదు. అలాంటి చోట దారుణాలకు పాల్పడుతున్నారు. నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు సంక్రాంతి రోజు చెబుతున్నా. మీరు పిచ్చపిచ్చగా ఆడితే పుట్టగతులు ఉండవు. తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. మిమ్మల్ని ఎలా పట్టించాలో నాకు తెలుసు” అని చంద్రబాబు అన్నారు.