నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని నన్నే అంటావా..? నేనేంటో చూపిస్తా- కొడాలి నానికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం.

Chandrababu Naidu Mass Warning To Kodali Nani

Chandrababu Naidu : గుడివాడ టీడీపీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోయారు. ఎమ్మెల్యే కొడాలి నాని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తావా..? నేనేంటో చూపిస్తా అంటూ కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

కొడాలి నాని ఇలాకా గుడివాడలో టీడీపీ బలప్రదర్శన చేసింది. రా కదలిరా సభలో కొడాలి నాని టార్గెట్ గా చంద్రబాబు ఫైర్ అయ్యారు. కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..? అని అడిగారు. కొడాలి నాని వేధింపులతో ఆయన అనుచరుడే ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు. గుడివాడకు ప్రధాన సమస్య ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని అని చంద్రబాబు అన్నారు. కొడాలి నాని.. పిచ్చ పిచ్చ ఆటలొద్దు.. నోరు పారేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.

”వెనిగండ్ల రామును అభ్యర్థిగా పెడదామంటే.. రావి వెంకటేశ్వరరావు ఒప్పుకున్నారు. రాము-రావి ఇద్దరూ కలిసి కొడాలి నానిని ఓడిస్తారు. కొడాలి నానిని చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలిపేసేలా ఓడించాలి. గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం. తన పనైపోయిందని పేర్ని నాని తన సుపుత్రుడిని దించారు. జోగి రమేష్ పెడనలో చెత్త.. ఇప్పుడు ఆ చెత్తను పెనమలూరుకు వేశారు. పెడనలో జోగి చిటీ చిరిగింది. గన్నవరం ఎమ్మెల్యే పేరు చెప్పను. అతను నా స్థాయే కాదు.

Also Read : 23 మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

గన్నవరం ఎమ్మెల్యే గంజాయి మొక్కని తెలీదు.. నేనే పెంచి పోషించా. కైలే అనిల్.. అభివృద్ధి సున్నా.. అవినీతి మిన్న. అవనిగడ్డ ఎమ్మెల్యే మురికి కాల్వ మరమ్మత్తు పనుల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు. గుడ్లవల్లేరులో మట్టికి రెక్కలొచ్చాయి” అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!

”ఏపీ మొత్తం టీడీపీ-జనసేన గాలి వీస్తోంది. టీడీపీ-జనసేన గాలి సునామీలా మారడం ఖాయం. మరో 83 రోజులే ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే పెద్ద తప్పిదం జరుగుతుంది. టీడీపీ-జనసేన పార్టీల అవసరం ఉందని ప్రజలను చైతన్యపరచాలి” అని పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.