TDP Politics: ప్రభుత్వ సాయం లేకనే చేనేత కుటుంబ ఆత్మహత్య: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ఆర్థిక ఇబ్బందులకు తోడు చేనేత కార్మికులపై అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

TDP Politics: రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం..ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో కృష్ణాజిల్లా పెడనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబం గురించి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరా తీశారు. చేనేత కార్మికుడు కాశం పద్మనాభం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడంపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ.. చంద్రబాబుకు నివేదిక అందించారు.

Also read: Gujarat Businessman: పద్మశ్రీ వ్యాపారవేత్తకు కుటుంబ సభ్యులు “హెలికాప్టర్ గిఫ్ట్”, దాన్ని ఏం చేశాడంటే?

ఆర్థిక ఇబ్బందులకు తోడు చేనేత కార్మికులపై అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న పద్మనాభం.. ఆర్థికంగా చితికిపోవడంతో పాటు.. ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ నివేదించింది. సహాయం అందక తీవ్ర మనోవేధనతో పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడ్డారని పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టి ఉంటే ఈఘటన జరిగేది కాదని నివేదికలో పేర్కొన్నారు.

Also read: ‘Kacha Badam’ Song :ఈ పల్లీలు అమ్మే వ్యక్తి పాటకు ప్రపంచమే ఫిదా..లల్లాయి పాటతో వరల్డ్ వైరల్

ట్రెండింగ్ వార్తలు