TDP Gives 2 Lakhs For Asha Worker Family (Photo : Google)
TDP Gives 2 Lakhs For Asha Worker Family : తడేపల్లిలో ఆశావర్కర్ రేపూడి కృపమ్మ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. ఆశావర్కర్ కుటుంబానికి నారా లోకేశ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళ కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కృపమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం అందజేశారు. టీడీపీ, సీఐటీయూ నిరసనతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని ఎమ్మెల్సీ అనురాధ అన్నారు.
”ఆశావర్కర్లు దేవుళ్ళతో సమానం. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా అధిక పని ఒత్తిడి కారణంగానే కృపమ్మ మృతి చెందారు. నారా లోకేశ్ బాధలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఆశావర్కర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులను గంజాయి కేంద్రాలుగా మార్చేశారు. అరకొర జీతాలు ఇస్తూ ఆశావర్కర్లకు నవరత్నాలు ఆపేశారు. ఆరోగ్య సురక్ష పేరుతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా బీపీ, షుగర్ మందులే ఇస్తున్నారు” అని విమర్శించారు ఎమ్మెల్సీ అనురాధ.
Also Read : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణలో ఆశా వర్కర్ రేపూడి కృపమ్మ మృతి చెందారు. అయితే, కృపమ్మది సహజమరణం కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అరకొర జీతాలు ఇస్తూ అధిక పని ఒత్తిడితో ఆశావర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆశావర్కర్ కృపమ్మ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. 2లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది.