Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మ‌హానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేపటి జిల్లా మినీ మహానాడు వాయిదా పడింది.

Gudivada Mahanadu : కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేపటి(జూన్ 29) జిల్లా మినీ మహానాడు వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేనందున పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచన మేరకు మినీ మహానాడును వాయిదా వేశారు. ఆ కార్యక్రమంపై ముఖ్య నేతలతో సమీక్షించిన చంద్రబాబు.. గుడివాడ మహానాడు నిర్వహణ తర్వాతే మరో కార్యక్రమం చేపడదామని అన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీని ఖరారు చేయాలని నేతలను ఆదేశించారు చంద్రబాబు.

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

గుడివాడ చుట్టూ ఏపీ రాజకీయం రగులుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన గుడివాడను ఈసారి ఎలాగైనా దక్కించుకుని ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టాలనుకున్న చంద్రబాబు.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ బలాన్ని చాటుకోవడానికి రేపు గుడివాడలో మినీ మహానాడు నిర్వహించాలని భావించారు. భారీ ఎత్తున కార్యకర్తలను గుడివాడకు తీసుకొచ్చి బలప్రదర్శన చేయించాలనుకున్నారు. అందుకు తగ్గట్టే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి గుడివాడ మినీ మహానాడు వాయిదా పడింది.

Andhra Pradesh: నేడు వర్షం అడ్డు రాకపోతే గుడివాడ గడగడలాడేది: కొల్లు ర‌వీంద్ర‌

అటు, తగ్గేదేలే అంటూ మాజీమంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబే తనపై పోటీకి వస్తే గుడివాడ కాటా దెబ్బ రుచి చూపిస్తానని అన్నారు. ఎవరు వచ్చినా గుడివాడలో ఐదోసారి తన గెలుపును ఆపలేరు అంటూ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు కొడాలి నాని. తన టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ మాత్రమే అని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీని గెలిపించలేని చంద్రబాబు.. గుడివాడలో ఏం గెలిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. గుడివాడ బహిరంగ సభ కోసం టీడీపీ నేతలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారని, నాలుగు జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు కొడాలి నాని.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అటు కొడాలి నాని కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు టీడీపీ నేతలు. గుడివాడ మినీ మహానాడుతోనే కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. గుడివాడ ప్రజలే కొడాలి నానిని తరిమికొడతారని హెచ్చరించారు. మాటల యుద్ధం నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో గుడివాడ మహానాడుకు వాతావరణం బ్రేకులేసింది. త్వరలో కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు