TDP-Jana Sena first list : టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 94 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

TDP-Jana Sena first list

TDP-Jana Sena first list Released : ఏపీలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీట్ల పంపకం, నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం శనివారం ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

Also Read : YS Jagan Mohan Reddy : కుప్పంలో చంద్రబాబు సతీమణి వ్యాఖ్యలపై సీఎం జగన్ సెటైర్లు ..

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తారని అన్నారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో క్లారిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామాలిష్ అయిందని, ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొదలుకొని నా వరకు, పవన్ కల్యాణ్ వరకు భరించామని, రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం అని చంద్రబాబు చెప్పారు.

ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందని అన్నారు. పవన్ కల్యాణ్ , నేను మంచి అభ్యర్థులను ప్రకటించామని, రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంతగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేశామని చెప్పారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ప్రజల, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత, మంచి అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ , 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారని అన్నారు.

జనసేన అభ్యర్థులు వీరే..
తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను జనసేన పార్టీ  ప్రకటించాల్సి ఉంది.

94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..

 

 

 

ట్రెండింగ్ వార్తలు