ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు జరిపారు. దాదాపు మూడున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. ఇందులో టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
జనసేన, టీడీపీ అభ్యర్థుల విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అభ్యర్థుల పేర్లు, వారి బలాబలాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన అభ్యర్థుల సీట్లపైనే పీటముడి పడే అవకాశం ఉంది.
ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన ఆశావాహ అభ్యర్థులు..