TDP Janasena New Strategy Trishula Vyuham
ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. మరో రెండు మూడు నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సర్వేలు, అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సర్దుబాటు చేసుకుంటూ ఉండగా.. టీడీపీ-జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక అజెండాతో ముందుకెళ్తోంది.
మధ్యలో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్రను పున:ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 18తో ముగియనున్న యువగళం పాదయాత్ర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్ పర్యటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ముగ్గురు నేతలు మూడువైపుల పర్యటిస్తూ ఎన్నికల్లో విక్టరీ కొట్టేలా అద్దిరిపోయే ప్లాన్ చేస్తున్నారు.
Also Read : వినూత్న పద్ధతిలో సర్వే.. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టుగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రతిపక్ష కూటమి. కర్నూలులో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్ర పున: ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ వారాహి యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నెల 18న లోకేశ్ యువగళం పాదయాత్రను ముగించనున్నారు. 20న విజయనగరం భోగాపరం సమీపంలో భారీ బహిరంగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ వేర్వేరుగా రాష్ట్రవ్యాప్తంగా చుట్టేయాలని నిర్ణయించారు. ఒకరి పర్యటన వల్ల ఇంకొకరికి అడ్డంకులు లేకుండా ముగ్గురూ ఒకేసారి రాష్ట్రంలో మూడువైపుల పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read : విశాఖపై పట్టు పెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?