వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. స్పందించిన టీడీపీ

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వారం రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

TDP leader buddha venkanna respond on ambati rayaudu quit YSRCP

Buddha Venkanna: వైఎస్ఆర్ కాంగ్రెస్ వీడుతున్నట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ప్రకటనపై టీడీపీ స్పందించింది. జగన్ గురించి తెలిసి వైసీపీలో చేసిన వారం రోజులకే పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. అమరావతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఆడుదాం ఆంధ్రాకి బ్యాట్ పట్టుకొని వొచ్చాడు అంబటి రాయుడు. వొచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని తెలిసి, పార్టీకి రాజీనామా చేశాడు. అంబటి రాయుడుకి శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ లాంటి దుర్మార్గుడితో రాజకీయ ఇన్నింగ్స్‌ ఆడకూడదని అంబటి రాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషదాయమని, భవిష్యత్తులో అతడికి మంచి
జరగాలని టీడీపీ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది.

కొడాలి నానికి వార్నింగ్
కొడాలి నానికి టైం దగ్గర పడిందని.. ఈ 100 రోజులన్నా నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, నారా లోకేశ్ ను తిడితే నానిని తిట్టబోమని, జగన్మోహన్ రెడ్డిని తిడతామన్నారు. మీ నాయకుడిని మాతో తిట్టించాలని ఉంటే మమ్మల్ని తిట్టాలన్నారు. గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడం ఖాయమని, కొడాలి నాని ఏ దేశానికి పారిపోయినా జనం వదలరని అన్నారు. చంద్రబాబు అరెస్టు చేస్తే 100 దేశాల్లో ఆందోళన చేశారని తెలిపారు.

కేశినేని వ్యాఖ్యలపై నో కామెంట్
తమ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బుద్ధా వెంకన్న నిరాకరించారు. ”కేశినేని నాని ప్రస్తుతం మా ఎంపీనే. ఆయన కామెంట్స్ పై నేను మాట్లాడను. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత స్పందిస్తాను. నేను భువనేశ్వర్ ప్రోగ్రాం లో వున్నాను.. నాకు పూర్తి సమాచారం తెలీద”ని చెప్పారు.