చంద్రబాబును తిట్టిన వాళ్లను వదిలేది లేదు- కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్

మీ సారీని నేను తీసుకోవడం లేదన్నారావిడ. అది, పులి బిడ్డ ఆమె.

Buddha Venkanna : అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై నోరు పారేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అధికారం ఉందని చంద్రబాబు, భువనేశ్వరిలపై నోరు పారేసుకున్న నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబుతో లాలూచీ పడ్డట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడానికి కూడా అర్హులు కాదన్నారు. వైసీపీ నేతలను వైసీపీ కార్యకర్తలు కూడా క్షమించరని బుద్ధా వెంకన్న అన్నారు. నిజమైన పులులంటే భువనేశ్వరి, పురంధేశ్వరి అని బుద్ధా వెంకన్న అన్నారు.

”ఎవరైనా మంచోళ్లు అయితే తెలుగుదేశంలోకి రావొచ్చు. అధికారం ఉందని విర్రవీగి ఆరోజు చంద్రబాబు, లోకేశ్ లపై నోరు పారేసుకున్న వారు ఎవరైనా పార్టీలో చేరతాను అంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే. పిరికి పందల గురించి చెప్పాలి. తప్పుడు కేసుల గురించి చెప్పాలి. వాళ్లు క్షమాపణలు కోరితే కుదరదు. రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని అన్నా భువనేశ్వరిని నానా మాటలు అన్నారు. ఇప్పుడు క్షమించండి అని ఒక మాట సారీ చెబితే అయిపోదు. భువనేశ్వరి ఇదివరకే చెప్పేశారు. మీ సారీని నేను తీసుకోవడం లేదన్నారావిడ. అది, పులి బిడ్డ ఆమె. మీరు కాదు పులులు. ఎన్టీఆర్ బిడ్డ ఆమె” అని బుద్ధా వెంకన్న అన్నారు.

”కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్, దేవినేని అవినాశ్, పోసాని కృష్ణమురళి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అదానీ కేసులో జగన్ కూడా జైలుకెళ్లక తప్పదు. అదానీ దగ్గర జగన్ లంచం తీసుకున్నట్లు అమెరికాలో రుజువైంది. గతంలో అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు రాజీపడ్డట్లు సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. పోసాని క్షమాపణలకు అర్హుడు కాదు. చంద్రబాబు, భువనేశ్వరిలను తిట్టిన వారందరి రికార్డులు మా దగ్గర ఉన్నాయి. చంద్రబాబును తిట్టిన వారిని వదిలేది లేదు. కాళ్లు పట్టుకున్నా, వేళ్లు పట్టుకున్నా.. ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసినా.. పార్టీలో చేరతామన్నా సరే.. వదిలేదు లేదు” అని నిప్పులు చెరిగారు బుద్ధా వెంకన్న.

Also Read : మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాలా రూ.6,500 కోట్లు: నారా లోకేశ్