Tdp Leader Dhoolipalla Narendra Arrested
TDP leader dhoolipalla Narendra : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు ఏసీబీ అధికారులు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడిలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ధూళ్లిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు.
సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.