చంద్రబాబుకి ఏమైనా జరిగితే ఈసీదే బాధ్యత : జూపూడి

ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఈసీ బాధ్యత వహించాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు.

  • Publish Date - March 27, 2019 / 01:31 PM IST

ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఈసీ బాధ్యత వహించాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు.

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఈసీ బాధ్యత వహించాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. సీఎంకు జెడ్ సెక్యూరిటీ ఉందని.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ను తొలగించారని చంద్రబాబుకు రక్షణగా ఎవరుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఢిల్లీలో ఈసీని టీడీపీ నేతలు కలిశారు. అనంతరం జూపూడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆలోచన విధానాన్ని టీడీపీ నేతలుగా ఈసీకి వివరించామని తెలిపారు.

రాజ్యాంగ బద్ధమైన సంస్థగా రాజ్యాంగ మూల సూత్రాలకు కట్టుబడి ఎలక్షన్ కమిషన్ ఉండాలని అడిగినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ‘ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు.. మా పరిధిలోకి రారని మీరు కోర్టుకు వెళ్లారు కదా.. మేము కూడా కోర్టులోనే చెబుతామని తెలిపిన విధానం’ తమను బాధ కలిగించదన్నారు. 
Read Also : IPS బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్

ఏపీ సీఎం చంద్రబాబుకు రక్షణగా ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ను తొలిగించారని సీఎంకి అనుకోకుండా సెక్యూరిటీ సమస్య వస్తే ఎవరు చూడాలని ప్రశ్నించారు. ఏమైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యులని.. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్.. ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఎవరైనా కంప్లైట్ చేస్తే అర్జెంట్ గా యాక్షన్ తీసుకునే సంస్థలాగా కనిపిస్తోందన్నారు. ఈసీ న్యూట్రాలిటీ బాడీగా ఉండాలని సూచించారు.

ఏపీలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము భావిస్తుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ నేతలు అవసరమైతే ప్రెసిడెంగ్ రూల్ పెట్టాలని ఇంతకముందే చెప్పారని గుర్తు చేశారు. జీవీఎల్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ రూల్ కు ఏపీ చాలా సవ్యంగా ఉందన్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రిపేర్ అయి.. ఏపీ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే వారు రిపీట్ గా ఫిర్యాదులు ఇస్తున్నారని తెలిపారు.
Read Also : బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని.. అవసరమైతే ఆఫీసర్ పై ఆరోపణ వస్తే వారితో మాట్లాడి వివరణ తీసుకుని, చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అర్ధరాత్రి ఒంటి గంటకు యాక్షన్ తీసుకుని అక్కడున్న చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ను బదిలీ చేస్తున్నాం.. కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తున్నామని చెప్పడం అభ్యంతరకరమని అన్నారు. 

ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వీకరించాలి.. కానీ వాటిపై న్యాయబద్ధమైన ఆలోచన చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఈసీ ఈవిధంగా ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం మంటగలిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈసీ తన పరిధిలోని అంశాలకే పరిమితం కావాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలోనికి రాని ఆఫీసర్ ను బదిలీ చేస్తే తమ ప్రభుత్వం జీవో జారీ చేసి.. ఆ ఆఫీసర్ ఇక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 
Read Also : కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ : బదిలీలపై ఆగ్రహం