టీడీపీతో సహా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కావాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.

  • Publish Date - January 5, 2020 / 01:16 PM IST

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు. ఆదివారం (జనవరి 5, 2020) ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతో సహా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కావాలని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు. ఇటీవల జేసీ ట్రావెల్స్ పై ఏపీ ప్రభుత్వం దాడులు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జేసీ.. బీజేపీ నేతలను కలుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ నేత జేపీ నడ్డాను కలిశారు. ప్రస్తుతం సత్యకుమార్ ను కలిశారు. అయితే పైకి మాత్రం టీడీపీలోనే ఉంటానని జేసీ చెప్పినా…ఆయన లోపల మాత్రం బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

జేసీకి బీజేపీ నుంచి ఆహ్వానం కూడా అందింది. జేపీ నడ్డాను కలిసిన సందర్భంలో బీజేపీకిలోకి ఎప్పుడు వస్తారని అడగ్గా..ఇప్పుడే రానని..ఇంకా సమయం ఉందని జేసీ తెలిపారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందవని… జాతీయ పార్టీల వల్లే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. జాతీయ పార్టీల్లో ఉంటేనే మనుగడ సాధించగలమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రాంతీయ పార్టీలో ఒక కుటుంబానికి చెందిన వారే నాయకులుగా ఉంటారు.. జాతీయ పార్టీలో అయితే అందరూ ఉంటారని చెప్పినట్లు సమాచారం.