ఆయనే నా మార్గదర్శకుడు.. నాలాంటి యువతకు స్ఫూర్తి: నారా లోకేశ్

రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రామోజీరావు తనకు మార్గదర్శకుడని చెప్పారు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర అని తెలిపారు.

తనలాంటి యువతకు ఆయన స్ఫూర్తి అని నారా లోకేశ్ చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతును వినిపించే తత్వం రామోజీరావుదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదని చెప్పారు.

రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు. ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని రామోజీరావు తనకు నిత్యం ఇచ్చే సూచన ఎప్పటికీ మరువబోనని తెలిపారు. రామోజీరావు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు.

దటీజ్ బండి సంజయ్.. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ప్రస్థానం.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు