వెరీ ఇంట్రస్టింగ్.. షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన నారా లోకేశ్.. ఎందుకో తెలుసా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలిశారు.

Nara Lokesh Special Thanks To YS Sharmila (Photo : Google)

YS Sharmila : టీడీపీ నేత నారా లోకేశ్.. సీఎం జగన్ సోదరి, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. లోకేశ్ ఏంటి షర్మిలకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అనే సందేహం కలగకమానదు. మ్యాటర్ ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ స్పెషల్ గిఫ్టులు కూడా పంపించారు. “వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి” అంటూ మేసేజ్ పంపారు షర్మిల.

దీంతో నారా లోకేశ్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్.. గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల ఫోటోలను ట్విట్టర్ లో ఉంచారు లోకేశ్.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

”అద్భుతమైన క్రిస్మస్ కానుకలు పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ మరియు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది” అని ట్వీట్ చేశారు లోకేశ్.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలిశారు. గతంలో వైసీపీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రశాంత్ కిశోర్.. టీడీపీతో జతకట్టడం ఏపీ రాజకీయవర్గాల్లో సెన్సేషన్ గా మారింది. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల.. చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కానుకలు పంపడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో హీట్ ను మరింత పెంచేశాయి.

Also Read : జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?