Andhra Pradesh Politics : జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేరం అని ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Politics : ఏపీ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. సొంత పార్టీ నేతలే తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఒట్టి ఆరోపణేల అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నా అధిష్టానికి మాత్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోందంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఓ పక్క బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించటంతో మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్ ల అంశం వైసీపీ అధిష్టానికి నిద్రలేకుండా చేస్తున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

ఈ ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం అనేది ఆషామాషీ కాదని ఇది కేంద్ర ప్రభుత్వం దృషికి వెళితే మామూలుగా ఉండదంటున్నారు. ఇది చాలా పెద్దనేరమని ఇటువంటి పరిస్థితుల్లో ఇక జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు టీడీపీ, నేతల మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. వైసీపీలో అసమ్మతివాదులు బాగా పెరిగిపోయారని వారంతా ఏకమై ప్రభుత్వాన్ని కూల్చటం ఖాయమన్నారు. ప్రతీ జిల్లాలోను ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని దానికి ప్రత్యక్ష ఉదాహరణే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి నేతల వ్యతిరేకత గళాలు అని తమలాంటివారి గళాలను వారు వినిపిస్తున్నారని అన్నారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని సాక్షత్తు కోటంరెడ్డి చెప్పిన మాటలేనని స్పష్టంచేశారు ప్రత్తిపాటి పుల్లారావు.

35మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ఇమడలేకపోతున్నారని పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కోటంరెడ్డి అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు ప్రత్తిపాటి. నెల్లూరు జిల్లాలో రాజుకున్న ఈ నిరసన సెగలు ప్రతీ జిల్లాకు పాకుతాయని నెల్లూరు నుంచి కృష్ణాజిల్లాకు నిరసనలు పాకాయని ఇక అసహనంతో ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా బయటపడతారని ఇక వైసీపీ సంకెళ్లను తెంచుకుని బయటపడతారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.

 

ట్రెండింగ్ వార్తలు