TDP Leader Yanamala Krishna: దివ్య నాకూ కూతురు లాంటిది.. ఆమె విజయంకోసం కృషిచేస్తా ..

నాకు, నా సోదరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అదే పార్టీ‌లో కొనసాగుతాం. తనకు అసంతృప్తి అనే మాటే లేదు. దివ్య నాకూ కూతురు లాంటిది. ఆమె విజయంకోసం కృషి చేస్తానని తుని నియోజవర్గం టీడీపీ నేత యనమల కృష్ణుడు అన్నారు.

TDP Leader Yanamala Krishna: నాకు, నా సోదరుడు యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని, అదే పార్టీలో కొనసాగుతామని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు అన్నారు. తుని నియోజకవర్గం సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విబేధాలు తలెత్తిన విషయం విధితమే. తుని టీడీపీ సీటు తన కూతురికి ఇస్తున్నారని యనమల రామకృష్ణుడు గతంలో సంకేతాలు ఇవ్వడంతో తమ్ముడు కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు ఇప్పటి వరకు తుని నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా కొనసాగిన కృష్ణుడును తొలగించి టీడీపీ అధినేత ఆ పదవిని దివ్యకు అప్పగించారు. దివ్య నియామకంపై కృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి.

Shooting On TDP Leader : పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై కాల్పులు.. ఇంట్లో నిద్రిస్తుండగా బయటికి పిలిచి..

తన అన్న కుమార్తె  దివ్యకు తుని నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల కృష్ణుడు ఆగ్రహంతో ఉన్నాడని, ఆయన త్వరలో వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలుసైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తుని నియోజకవర్గం టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. యనమల కృష్ణుడిని బుజ్జగించే ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పత్తిపాటి ఇన్‌ఛార్జి రాజాలు యనమల కృష్ణుడిని గురువారం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రబాబు నివాసంలో అధినేతతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడికి పార్టీలో తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.

TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్

చంద్రబాబుతో భేటీపై యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఎంతో తృప్తినిచ్చిందని, చంద్రబాబు తగు గుర్తింపు ఇస్తారనే నమ్మకం నాకుందని అన్నారు. నాకు, నా సోదరుడు యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశంలోనే ఉన్నామని, అదే పార్టీ‌లో కొనసాగుతామని తెలిపాడు. తనకు అసంతృప్తి అనే మాటే లేదని, దివ్య నాకూ కూతురు లాంటిదని, ఆమె విజయంకోసం కృషి చేస్తానని రామకృష్ణుడు అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. యనమల కృష్ణుడుని పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యాదవుల ఐక్యతకు కృష్ణుడు కృషి చేస్తారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు